ట్రాన్స్‘ఫార్మర్’ కష్టాలు
నాలుగు రోజుల క్రితం మండల పరిధిలోని అలిరాజ్పేట్ గ్రామ సమీపంలోని రహదారి పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుండి గుర్తుతెలియని దుండగులు రాత్రి వేళలో అయిల్ను అపహరించారు. దీంతో ఆ చుట్టూ పక్కల గ్రామల రైతుల పంటల పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇది గమనిం చిన రైతులు జరిగిన విషయాన్ని విద్యు త్ శాఖ అధికారులకు తె లియజేశారు. అయితే పోలీసు స్టేషన్ నుండి ఎఫ్ఐఆర్(ప్రాథమిక సమాచార నివేదిక) తీసుకురావాలని రైతులకు సూచించారు. రైతు లు పోలీసు స్టేషన్లో అయిల్ చోరి విషయాన్ని ఎస్ఐ వీరన్నకు వివరించారు.
దీంతో ఎస్ఐ అయిల్ చోరీకి సంబంధించిన ఎప్ఐఆర్ను సీఐ ద గ్గరికి వెళ్లి తీసుకోవాలని చెప్పడంతో పోలీసు స్టేషన్లో జరిగిన విషయంను విద్యుత్ అధికారులకు వివరించారు. ఎప్ఐఆర్ ఉంటేనే ట్రాన్స్ఫార్మర్లో అయిల్ పోసి మరమ్మతులు చేస్తామని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆ గ్రహించిన రైతులు అలిరాజ్పేట్-గణేష్పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై శుక్రవా రం అరగంటకుపైగా ధర్నాకు దిగారు. ఏడాదికాలంలో ఒకే ట్రాన్స్ఫార్మర్ నుం చి నాలుగుసార్లు అయిల్ చోరీ జరుగుతున్న పోలీసులు దొంగలను పట్టుకోవడంతో విఫలమవుతున్నారని రైతులు ఈ సందర్భంగా ఆరోపించారు. అటు పోలీసుల నిర్లక్ష్యం, ట్రాన్స్కో అధికారు ల అలసత్వం వల్ల తమ పంట పొలాలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న ఏఈ శ్రీనివాస్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయిస్తామని రైతులకు చెప్పడంతో ఆందోళనను విరమించారు.