విశాఖ పోలీస్ కమిషనరేట్ లో భారీగా బదిలీలు
విశాఖ:నగర పోలీస్ కమిషనరేట్ లో భారీ బదిలీల పర్వం ఊపందుకుంది. ఒకే స్ధానంలో ఎక్కువ సంవత్సరాలు పని చేసిన పలువురు పోలీస్ ఉద్యోగులపై నగర కమిషనర్ అమిత్ గార్గ్ బదిలీ వేటు వేశారు.
నాలుగున్నర సంవత్సరాలుగా విశాఖ నగర కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 308 కానిస్టేబళ్లను ఈ మేరకు బదిలీ చేస్తున్నట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.