డబ్బులు ఖాళీ... ఖాతాదారుల ఆందోళన
సుండుపల్లి(వైఎస్సార్ జిల్లా): భారతీయ స్టేట్ బ్యాంకులో డబ్బులు లేక ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకపోవడంతో మంగళవారం ఉదయం ఖాతాదారులు బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్యాంకులో సరిపడా డబ్బులు లేనందున ఒక్కొ ఖాతాదారునికి కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు.
బ్యాంకు సిబ్బందితో ఘర్షనకు దిగారు. తమ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు తీసుకునేందుకు వీలులేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అన్నింటికీ చార్జీలు వసూలుచేసే బ్యాంకు అధికారులు, తమ డబ్బును ఇవ్వలేమని చేతులు ఎత్తేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఖాతాదారుకు నచ్చచెపేందుకు ప్రయత్నించారు. అయినా వారు శాంతించలేదు, బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు.