పశువుల హాస్టల్ సిద్ధం
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే మోడల్‌గా ఏర్పటు చేస్తున్న పశువుల హాస్టల్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. వచ్చే నెల 2 నిర్వహించనున్న నాలుగో విడత జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. కల్లూరు మండలం తడకనపల్లిలో 10 ఎకరాల్లో హాస్టల్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు దీని కోసం దాదాపు రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. చిన్నటేకూరు పశు వైద్యాధికారి డాక్టర్ ఆర్ నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరగుతున్నాయి.