ఏసీబీ వలలో ఏఎస్ఓ
పట్టాదారు పాస్బుక్కు కోసం లంచం తీసుకుంటూ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ఏఎస్ఓ) ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం సంచలనం సృష్టించింది.
ఏసీబీ డీఎస్పీ ఆర్. సాయిబాబా కథనం ప్రకారం.. మండలంలోని బాగిర్థిపేట గ్రామానికి చెందిన రైతు బొడ్డు శ్రీనివాసరావు జనవరి 7న బైక్‌పై వెళుతుండగా అతడి పట్టాదారు పాస్‌పుస్తకం ఎక్కడో పడిపోరుుంది. ఎంత వెతికినా దొరకకపోవడంతో పాస్బుక్కు(బి) తిరిగి పొందేందుకు తహసీల్దార్ కార్యాలయంలో జనవరి 21న దరఖాస్తు చేసుకున్నాడు. సర్వే నంబర్ 220(బీ)లో ఉన్న 20 గుంటల భూమి, 225సీలోని ఒక ఎకరం 30 గుంటల భూమిపై పట్టాపాస్‌పుస్తకం పొందాల్సి ఉంది. తహసీల్దార్ శ్రీనివాసరావు(ఇటీవల బదిలీపై వెళ్లారు) సంబంధిత ఫైల్‌పై సంతకం చేసి ఏఎస్ఓ శాగంటి వెంకన్న దగ్గరకు పంపారు.
వెంకన్న దగ్గరికి రైతు శ్రీనివాసరావు వెళ్లగా నిబంధనల ప్రకారం పాస్‌బుక్ ఇవ్వాలంటే పోలీస్ సర్టిఫికెట్‌తోపాటు నోటరీ అఫిడవిట్ కావాలని చెప్పాడు. దీంతో ఆయన సంబంధిత సర్టిఫికెట్లన్ని తీసుకొచ్చి ఏఎస్‌ఓకు అప్పగించాడు. అన్నీ ఉన్నా పాస్‌పుస్తకం పొందాలంటే రూ.6 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. రైతు అంత ఇవ్వలేనని బతిమిలాడడంతో రూ.4 వేలు ఇవ్వాలని తేల్చి చెప్పాడు. సరేనని ఒప్పుకున్న బాధితుడు ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మార్చి 1న వరంగల్‌లో ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు.
దీంతో వారి సూచనలతో అతడు మంగళవారం తహసీల్దార్ కార్యాలయూనికి చేరుకుని ఏఎస్ఓ వెంకన్నకు రూ.4 వేలు ఇచ్చాడు. దీంతో అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజర్చునునట్లు ఏసీబీ డీఎస్పీ ఆర్.సాయిబాబా తెలిపారు. వెంకన్నను పట్టుకున్న వారిలో సీఐలు ఎస్వీ రాఘవేందర్రావు, పి. సాంబయ్య, ఎం. వెంటేశ్వర్రావు, ఏసీబీ సిబ్బంది ఉన్నారు.