రక్షణ చట్టం ఏర్పాటుచేయాలి
రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు
నాయుడుపేట : రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుచేయాలని రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య కోరారు. నాయుడుపేటలోని గరిడివీధిలో ఆదివారం సంఘం 5వ జిల్లా మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల కోసం తీసుకువచ్చిన అట్రాసిటీ చట్టం మాదిరిగానే రజకుల కోసం చట్టం తేవాలన్నారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై 70 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ఫలితం కనిపించడంలేదన్నారు. సంఘం నాయకులు పసుపులేటి రమేష్, జానకిరామ్, జే సుబ్రమణ్యం, మాధవయ్య, మధు, కలత్తూరు రమణయ్య, జే హుస్సేన్, మనోరమ్మ, చందన పాల్గొన్నారు.