గొర్రెల మందపై చిరుత దాడి
కంబదూరు(శెట్టూరు): శెట్టూరు మండలం బచ్చేహళ్లిలో గొర్రెలకాపరి నాగప్పకు చెందిన గొర్రెల మందపై బుధవారం ఆర్థరాత్రి చిరుత దాడి చేసింది. మందలోని ఒక గొర్రెను ఎత్తుకెళ్లి చంపేసింది. వర్షం పడుతుండడంతో బాధితుడు గుర్తించడం ఆలస్యమైంది. రూ.5 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామచంద్రానాయక్, బీట్ అఫీసర్ జగన్నాథ్‌లు గురువారం సంఘటన çస్థలాన్ని పరిశీలించి గొర్రెకు పంచనామా నిర్వహించారు.