భక్తియోగం
మామిడిపూడి ‘గీత’
భక్తియోగాన్ని గురించి శ్రీకృష్ణభగవానుడు సెలవిచ్చిన సంగతులను మననం చేసుకుందాము.
అపి చే త్సుదురాచారె భజతే మానన్య భాక్
సాధురేవ స మంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః( 9-30)
‘‘అర్జునా! ఎటువంటి వాడైనా సరే, అనన్య భక్తితో నన్ను భజించేవాడు మంచి నిర్ణయం కలవాడు కాబట్టి సాధువుగానే పరిగణించాలి. అతడు అనతి కాలంలోనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని, కీర్తిని పొందుతున్నాడు.
నా భక్తుడు ఎన్నటికీ చెడడు. అనన్య భక్తితో ఎల్లప్పుడూ తనయందే మనస్సును నిలిపి తననే ఎవరు భజిస్తున్నారో, వారి యోగక్షేమాలను తానే స్వయంగా చూసుకుంటానని శ్రీకృష్ణ పరమాత్మ అభయమిచ్చి ఉన్నాడు!
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః( 18-66)
‘‘అర్జునా! అన్ని ధర్మాలనూ పక్కనబెట్టి నన్నే శరణు పొందు. నేను నిన్ను సమస్త పాపాలనుండి విముక్తుడిని చేస్తాను. నీవు విచారించకు’’
భక్తితో ప్రయత్నం చేసిన అందరూ ప్రయోజనాన్ని పొందుతారు.
ఈ కీలకాన్ని తెలుసుకుని, మనం ఎట్టి సంశయాలనూ పెట్టుకోక శ్రద్ధాభక్తులతో గీతాశాస్త్రాన్ని అనుసరించి, దానికి తగ్గట్టు నడచుకుంటే ఎన్నో మేళ్లను పొందవచ్చు.
కూర్పు: బాలు- శ్రీని
(వచ్చేవారం: అర్జునుని సంశయాలకు శ్రీకృష్ణుని సమాధానాలు)