భారత్ ‘ఎ’ పరాజయం
మూడు వికెట్లతో నెగ్గిన ఆసీస్ ‘ఎ’
బ్రిస్బేన్: 159 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టును 50 పరుగులకే నాలుగు వికెట్లు తీసి ఇబ్బంది పెట్టిన భారత్ ‘ఎ’ బౌలర్లు చివరి రోజు మాత్రం చేతులెత్తేశారు. ఫలితంగా ఈ నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ లో ఆసీస్ ‘ఎ’ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఆదివారం ఆటలో ఆసీస్ ‘ఎ’ తమ రెండో ఇన్నింగ్స్‌లో 57.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 161 పరుగులు చేయగలిగింది.
శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిం చినా చివరి రోజు మిగిలిన ఆరు వికెట్లను తీయలేకపోయింది. భారీ వర్షం కారణం గా మైదానం చిత్తడిగా మారడంతో ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ (151 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు) తుదికంటా నిలిచి విజ యంలో కీలక పాత్ర పోషించగా, అతడికి వెబ్‌స్టర్ (87 బంతుల్లో 30; 3 ఫోర్లు) అద్భుత సహకారాన్ని అందించాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 57 పరుగులు జత చేరాయి. శార్దూల్ ఠాకూర్‌కు 3, వరుణ్ ఆరోన్‌కు 2 వికెట్లు దక్కాయి.