7 నుంచి బ్యాడ్మింటన్ సెలెక్షన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కోసం ఈనెల 7 నుంచి సెలెక్షన్ టోర్నమెంట్ జరుగనుంది. ఖమ్మం జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో 10వ తేదీ వరకు ఈ ఎంపిక పోటీలు జరుగుతారుు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలబాలికలు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థారుు టోర్నమెంట్‌కు ఎంపికవుతారు. ఆసక్తి గల అభ్యర్థులు ఖమ్మం జిల్లా బ్యాడ్మింటన్ సంఘం సెక్రటరీ ఆనంద్ (9848145441)ను సంప్రదించవచ్చు.
రంగారెడ్డి జిల్లా సెలక్షన్స్ రేపు
రంగారెడ్డి జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అండర్-14 బాస్కెట్‌బాల్ సెలెక్షన్స జరుగనున్నాయి. శివరాంపల్లిలోని బాస్కెట్‌బాల్ గ్రౌండ్సలో బాలబాలికలకు వేరువేరుగా ఈ ఎంపిక పోటీలు జరుగుతాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు అంతర్ జిల్లా సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌కు ఎంపికవుతారు. మరిన్ని వివరాల కోసం నయీముద్దీన్ (9848396922)ను సంప్రదించవచ్చు.