Bathukamma Games
-
సమాజం.. ఆరోగ్యం
మహబూబ్‌నగర్ రూరల్ : ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం అవసరమని.. ఇదే అందరి లక్ష్యం కావాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యాన శనివారం పోషణ్ అభియాన్ కార్యక్రమంపై మేళా ఏర్పాటుచేశారు. డీడబ్ల్యూఓ జి.శంకరాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, జాయింట్ కలెక్టర్ వెంకట్రావ్, ఐసీడీఎస్ రీజినల్ ఆర్గనైజర్ రాజ్యలక్ష్మి, ఫుడ్ కమిషనర్ మెంబర్ శారద, ఇన్చార్జి డీఎంహెచ్ఓ కృష్ణ, మాస్ మీడియా మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి, స్వచ్ఛ భారత్ జిల్లా ఇన్చార్జి ధృతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతృత్వం ఎంతో గొప్పదైన మాతృత్వ మధురిమ అనుభవిస్తున్న వారు పిల్లలకు తల్లి పాటే పట్టాలని కోరారు. తల్లి పాల విశిష్టతను అంగన్వాడీ టీచర్లు ప్రతీ తల్లికి వివరిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అలాకాకుండా బిడ్డలకు పోత పాలు పడితే పిల్లల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని కలెక్టర్ హెచ్చరించారు. పోషకాహారం ఎంత ముఖ్యమో పోషణ అభియాన్ ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిపారు. అనంతరం పలువురు చిన్నారులకు కలెక్టర్, జేసీ అన్నప్రాసన చేయించారు. ఇదిలా ఉండగా పోషణ్ అభియాన్‌లో భాగంగా కూరగాయలను, ఇతర పోషక పదార్థాలను అంగన్వాడీ టీచర్లు ప్రదర్శనలో ఉంచారు. ఓటుహక్కుపై అవగాహన కల్పించాలి జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు మహిళలకు ఓటుహక్కుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ సూచించారు. ఈసారి అత్యాధునిక ఓటింగ్ యంత్రాలతో ఓటింగ్ జరగనుందని తెలిపారు. ఓటర్లు ఎవరూ కూడా ఓటు అమ్ముకోవద్దని వివరించడంతో పాటు ప్రతిఒక్కరు ఓటు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఆకట్టుకున్న నృత్యాలు పోషణ్ అభియాన్ మేళాలో అంగన్వాడీ టీచర్లు, ఎఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. టీచర్ల అందెల సవ్వడితో ఫంక్షన్ హాల్ మార్మోగింది. గిరిజన సంప్రదాయ నృత్యంతో పాటు దాండియా పాటలు, నృత్యాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఈఓ సుజాత, సీడీపీఓలు రాజేశ్వరి, స్వప్నప్రియ, పారిజాత, లక్ష్మి, వెంకటమ్మ, డీసీపీఓ నర్మద, సఖి కేంద్రం ఇన్చార్జి మంజుల, సీనియర్ అసిస్టెంట్ యాదయ్య, జూనియర్ అసిస్టెంట్లు శిరీష, రాజశేఖర్, వెంకటేష్ పాల్గొన్నారు. -
తీన్మార్ స్టెప్పులు.. బతుకమ్మ ఆటలు
ముక్తాపూర్ (భూదాన్‌పోచంపల్లి) : పోచంపల్లి మండలం ముక్తాపూర్‌లో విదేశీయులు ఆదివారం సందడి చేశారు. తీన్మార్ స్టెప్పులు, బతుకమ్మ ఆటలతో ఆకట్టుకున్నారు. గ్రామీణ కుల వృత్తులు, పంచాయతీ పాలనపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్త(నిర్డ్), పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో జింబాబ్వే, సిరియా, ఎరిథ్రియా, టంజానియా, తజకిస్తాన్, సూడాన్, సౌత్ సూడాన్, మారిషస్, ఘనా, మయన్మార్ దేశాలకు చెందిన 16మంది గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, మహిళా సంక్షేమ శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మునుకుంట్ల బాలచంద్రం, పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్, వీఆర్వో శ్రీకాంత్, వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. గామ పంచాయతీ పాలన, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక, వారి విధులను అడిగి తెలుసుకొన్నారు. అలాగే గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. కులవృత్తుల అధ్యయనంలో భాగంగా చేనేత, గీత, మత్స్య, కుమ్మ రి వృత్తులను పరిశీలించారు. వారితో ముచ్చటించారు. కల్లు గీసే విధానం, మగ్గాలు, స్థానిక చెరువులో చేపల పెంపకాన్ని పరిశీలించారు. గ్రామ కూడలిలో స్థానికులతో కలిసి విదేశీయులు బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు. ఈత కల్లు రుచి చూశారు. అనంతరం గ్రామంలో అధ్యయనం చేసిన సామాజిక, ఆర్థిక అంశాలపై సోషల్ మ్యాప్‌ను గీశారు. ముక్తాపూర్ గ్రామ పర్యటన ఎంతో ఆకట్టుకొందని, ఇక్కడి ప్రజలు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఐఆర్డీ కోర్సు డైరక్టర్ డాక్టర్ టి.విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్ఐఆర్డీలో ‘సముదాయక భాగస్వామ్యంతో అభివృద్ధి’ అనే అంశంపై ఆరు వారాల అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందు లో భాగంగానే క్షేత పర్యటన నిమిత్తం ముక్తాపూర్‌ను సందర్శించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు ప్రవీణ, అనిత, శోభ, ఉపసర్పంచ్ కళమ్మ, వార్డు సభ్యులు బండారు ప్రకాష్‌రెడ్డి, ఇటమోని లక్ష్మయ్య, కొండమడుగు రామేశ్వర్, కె. మహేష్, జి.ధనమ్మ, గొలనుకొండ కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు.