విభజన జరిగితే నీటి కోసం యుద్ధమే: భూమా
కర్నూలు: ఇప్పటికే రాష్ట్రానికి జల వివాదాలు ఉన్నాయని వైఎస్ఆర్ సిపి నేత భూమా నాగిరెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విభజన ప్రకటన తర్వాత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమస్యలు అడగటం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ కర్నూలులో వైఎస్ఆర్సీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు.
ఏపీ నీటి పారుదలశాఖ అధికారులు సమైక్యాంధ్రకు మద్దతుగా నంద్యాలలో ర్యాలీ నిర్వహించారు.
ఆళ్ళగడ్డలోని 18వ నెంబరు జాతీయ రహదారిని సమైక్యవాదులు సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో దిగ్బంధం చేయనున్నారు. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి వారికి మద్దతు ప్రకటించారు.