ఘనంగా బాటా సంక్రాంతి వేడుకలు
సిలికాన్‌వాలీ, బే ఏరియా ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోలో సంక్రాంతి వేడుకలు, రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా) ఆధ్వర్యంలో రోజంతా సాగిన సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకల్లో ఇండో అమెరికన్(ఎఐఎ) బృందం పాలుపంచుకుంది. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, చిత్రలేఖనం, చెస్ వంటి వాటిలో నిర్వహించిన పోటీల్లో ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. సిలికాన్ వ్యాలీలోని పలువురు ప్రముఖులతో పాటు దాదాపు 1000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సూపర్ చెఫ్ పోటీల్లో పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొంటే చిన్నారులకోసం నిర్వహించిన లిటిల్ చెఫ్ పోటీలకు కూడా మంచి స్పందనే వచ్చింది. సూపర్ చెఫ్ పోటీలకు సతీష్ వేమూరి, వినయ్, ఉమాకాంత్ జడ్జీలుగా వ్యవహరించారు.
సంక్రాంతి కార్యక్రమాలు జరిగిన వేదిక కూడా పండుగ వాతావరణాన్ని తలపించేలా అలంకరించారు. ముగ్గులు, గాలిపటాలు, మరోవైపు దేశభక్తిని పెంచేలా అమెరికా, భారత్ దేశాల జెండాలను అలంకరించారు.సాంస్కృతిక కార్యక్రమాల్లో 'పాటల పల్లకి' హైలైట్‌గా నిలిచింది. యువ గాయనీ గాయకులు తమ గాన సౌందర్యాన్ని అందరికీ అందించి ప్రశంసలను అందుకున్నారు. ప్రసాద్ మంగిన ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేసి,గాయనీ గాయకులను పరిచయం చేశారు. టాలీవుడ్ సినిమాల్లో హిట్టయిన ఎన్నో గీతాలను ఈ సందర్భంగా పాడారు.
'తెలుగు టైమ్స్', బాటా కలిసి నిర్వహిస్తున్న 'పాఠశాల' విద్యార్థులు తెలుగు పద్యాలను, పాటలను, నాటికలను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. చిన్నారులు తెలుగు భాషపై చూపించిన పట్టును అందరూ ప్రశంసించారు. బే ఏరియాలో దాదాపు 5 కేంద్రాల్లో 250 మందికిపైగా చిన్నారులు తెలుగు భాషను నేర్చుకుంటున్నారు.
బాటా సలహాదారు విజయ ఆసూరి ప్రధానమైన కార్యక్రమానికి తెరలేపారు. చిన్నారులకు భోగిపళ్ళను పోసేందుకు చిన్నారులను, తల్లితండ్రులను, పెద్దలను స్టేజిపైకి ఆహ్వానించారు. వసుధైక కుటుంబం పేరుతోనిర్వహించిన ఈ?కార్యక్రమంలో పెద్దలంతా పిల్లలపై భోగిపళ్ళను పోశారు. శివ నూపురం స్కూల్ ఆఫ్ కూచిపూడి (సింధు కంది) స్టూడెంట్లు శాస్త్రీయ రూపకాన్ని ప్రదర్శించారు. టాలీవుడ్ డ్యాన్స్‌లను ఏరో డ్యాన్స్గ్రూపు (రంజని మంద), క్రియా డ్యాన్స్ అకాడమి (ఉమ ధన్పాల్), జయ శర్మ, గాయత్రి జోషి, రిథమిక్ స్క్వాడ్ గ్రూపులకు చెందిన వాళ్ళు ఉత్తేజకరమైన డ్యాన్స్‌లతో అందరినీ ఉత్సాహపరిచారు. ఎఐఎ టీమ్ వారురిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని చేసిన ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. డా. రమేష్ కొండ, జీవన్ జుష్టి, రాజ్ భానోత్ స్టేజిపైకి ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు.
అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి, డిప్యూటీ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా రోహిత్ సతీష్, అసెంబ్లీ మెంబర్లు యాష్ కల్రా, మార్క్ బెర్మన్, కాన్సెన్ చు, శాన్‌హోసె సిటీ మేయర్శామ్ లిక్కార్డో, ఫ్రీమాంట్ సిటీ మేయర్ లిలి మే, కుపర్టినో సిటీ వైస్ మేయర్ డార్సి పాల్, బుర్లింగమే సిటీ వైస్ మేయర్ మైఖెల్ బ్రౌన్ రిగ్, సరటోగా సిటీ కౌన్సిల్ మెంబర్ రిషి కుమార్, సన్నివాలే సిటీ కౌన్సిల్ మెంబర్రుస్సెల్ మెల్టన్ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. అందరూ తమ ప్రసంగంలో అందరికీ సంక్రాంతి, రిపబ్లిక్ డే శుభాకాంక్షలను అందజేశారు.
ఈ వేడుకల నిర్వహణకు పలు సంస్థలు తమ సహకారాన్ని అందించాయి. రామకృష్ణ వెనుజియా, ఫైనాన్షియల్లి సావి, రవి ట్యాక్స్ సర్వీసెస్, యు స్మైల్ డెంటల్, లావణ్య దువ్వి (రియల్టర్), మను ఛంగోత్ర (రియల్టర్), స్వాగత్ ఇండియన్ కుజిన్, కేక్స్ అండ్ బేక్స్ (ఫుడ్ స్పాన్సర్), బిర్యానిజ్, షాలిమార్, వాలీ టెక్ ఫోర్స్ తదితరులు బహుమతులను స్పాన్సర్ చేశారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బూత్‌లకు మంచి స్పందనే వచ్చింది. మీడియా పార్టనర్లుగా విరిజల్లు రేడియో, దేశీ 1170 ఎఎం, తెలుగు టైమ్స్, టీవీ 9, వి6 టీవీ, టీవీ ఏసియా వ్యవహరించాయి.
బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శిరీష బత్తుల(ప్రెసిడెంట్), యశ్వంత్ కుదరవల్లి(వైస్ ప్రెసిడెంట్), సుమంత్ పుసులూరి(సెక్రటరీ), హరినాథ్ చికోటి(ట్రెజరర్), శ్రీకర్ బొద్దు(జాయింట్ సెక్రటరీ), స్టీరింగ్ కమిటీ సభ్యులు కళ్యాణ్ కట్టమూరి, రవి తిరువీధుల, కామేష్ మల్ల, కల్చరల్ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, లాజిస్టిక్ కమిటీ సభ్యులు నరేష్ గాజుల, అరుణ్ రెడ్డి, ప్రశాంత్ చింత, కొండల్ రావు తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు. బాటా అడ్వయిజరీ బోర్డ్ నాయకులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండ, కరుణ్ వెలిగేటి వేడుకలను చక్కగానిర్వహించిన టీమ్‌ను అభినందించారు. బాటా కమిటీ వేడుకల నిర్వహణలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది.