ఖేడ్ లో స్వతంత్ర అభ్యర్థిని నిలుపుతాం
బీసీ సంక్షేమ సంఘం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక న్యాయానికి రాజకీయ పార్టీలు పాతర వేస్తున్నాయని, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో ఒక్క పార్టీ కూడా బీసీలకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. రెండురోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కలుపుకుని నారాయణ్‌ఖేడ్‌లో స్వతంత్ర అభ్యర్థిని బరిలో నిలుపుతామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బీసీలకు జరిగిన అన్యాయంపై ఈ ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం నిర్విహ ంచి, అగ్రకుల పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చిన్నరాష్ట్రం ఏర్పడితే సామాజిక న్యాయం జరుగుతుందన్న పార్టీల మాటలు నీటిమూటలుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ర్టంలోని పార్టీలు మెజారిటీ ప్రజలకు రాజకీయ అధికారం దక్కకుండా పోటీపడుతున్నాయని, అందులో భాగంగానే ఏ పార్టీ కూడా బీసీలకు టికెట్ ఇవ్వలేదన్నారు.