18న కలెక్టరేట్ల ముట్టడి:ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీల బడ్జెట్‌ను 2 వేల కోట్ల నుంచి 20 వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 18వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను, కరపత్రాన్ని శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆవిష్కరించారు.
రూ.10 వేల కోట్లతో బీసీ ప్లాన్ అమలు చేయాలని, కల్యాణ లక్ష్మిని బీసీలకు వర్తింపచేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈ నెల 18న తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోబీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.దుర్గయ్యగౌడ్, ఎన్.భూపేష్సాగర్, ఎం.పృథ్విరాజ్‌గౌడ్, జి.శ్రీకాంత్‌గౌడ్, బత్తినరాజు, సంతోష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.