ఆ ఎస్టేట్పై ప్రభుత్వానికి హక్కు లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: బెంగళూరు నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత బోల్యూ ఎస్టేట్పై కర్ణాటక ప్రభుత్వానికి హక్కు లేదని, దీన్ని 117 ఏళ్ల కిందట అప్పటి మైసూర్ యువరాణి తరఫున దివాన్ కొన్నారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్టేట్లోని వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పునరుద్ధరించింది. ఎస్టేట్ కొనుగోలు ఒప్పందం అమల్లోకి వచ్చి వందేళ్లయిందని, ఇప్పుడు అది మోసపూరితమని ప్రభుత్వం వాదించజాలదని పేర్కొంది.
‘ఎస్టేట్ కోసం యువరాణి తన సొంత డబ్బులు చెల్లించారు.. ఆ ఆస్తి మీదే అయితే మీరు ఎందుకు మళ్లీ స్వాధీనం చేసుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.24 ఎకరాల విస్తీర్ణమున్న చారిత్రక బోల్యూలో ఒక హోటల్, పలు వాణిజ్య భవనాలు, నివాసగృహాలు ఉన్నాయి.