బెలుం గుహల్లో కొలకలూరి ఇనాక్
కొలిమిగుండ్ల: బెలుం గుహలను ఆదివారం పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ఎస్కె ఎస్వీ యూనివర్శీటీల రిటైర్డ్ వైస్‌చాన్సలర్ కొలకలూరి ఇనాక్ తిలకించారు. గుహల మేనేజర్ ఏఎంవీ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం భూగర్భంలో ఏర్పడిన వివిధ ఆకతులను సందర్శించారు. గుహలు ఏర్పడిన విధానం, ప్రాముఖ్యత తదితర అంశాలపై మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. భూమి లోపల విశాలంగా ఏర్పడి గుహలు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు.