ఆ వర్గం భవిష్యత్‌లో కనిపించదా?
వెనక్కు తిరిగి చూసుకుంటే 2 వేల సంవత్సరాల చరిత్ర. ఎన్నో అటూపోట్లు. అన్నింటినీ సమర్ధంగా ఎదుర్కొని నిలబడినా కాలం దేన్నేయినా చరిత్రలో కలిపేసుకుంటుంది కదా. 'బెనే ఇస్రాయిల్' వర్గం భారతదేశంలో మిణుకుమిణుకు వెలుగుతున్న ఓ దీపం. వేల సంవత్సరాల కిందట ఇజ్రాయెల్ నుంచి మన దేశానికి వచ్చిన కొందరు 'జ్యూ'లు అప్పటి బొంబాయిని తమ సొంతవూరిగా మార్చుకున్నారు. అక్కడే జీవనం సాగిస్తూ వస్తున్నారు. 2010లో ఓ ఫోటోగ్రాఫర్‌కు తీసిన ఫోటో భారతదేశంలో అంతరించిపోతున్న ఇజ్రాయిలీల గురించి బయటకు తెచ్చింది.
ఆ ఫోటో తీసిన కొద్ది రోజుల తర్వాత వేరే షూట్ ప్రయత్నాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్ అహ్మదాబాద్‌లో స్ధిరనివాసం ఏర్పరచుకున్న ఇండియన్-జ్యూయిష్ రచయిత ఈస్టర్ డేవిడ్‌ను కాకతాళీయంగా కలిశారు. అప్పుడు గానీ తెలియలేదు భారత్‌కు వచ్చిన ఇజ్రాయిలీలు ఇక్కడే ఎందుకు స్ధిరపడ్డారో. వారికెందుకు భారతీయ వాతావరణం నచ్చిందో. దాంతో తన తర్వాతి షూట్ ఇదేనని నిర్ణయించుకున్నాడు. డేవిడ్‌తో కొద్దిరోజులు పాటు అహ్మదాబాద్‌లో ప్రయాణం చేసి జ్యూల సంప్రదాయాన్నీ అద్భుతంగా చిత్రీకరించాడు.
ఈ సమయంలో జ్యూలు ఫోటోగ్రాఫర్‌తో చెప్పిన విషయం ప్రపంచంలో ఎక్కడికెళ్లినా దొరకని స్వతంత్రం భారతదేశంతో లభిస్తోందని. ఆ మాట విన్న ఫోటోగ్రాఫర్ కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. ప్రస్తుతం దేశంలో చాలా తక్కువ మంది జ్యూలు ఉన్నారు. వారి వర్గం క్రమంగా తగ్గిపోతోంది.