జీజేఎం అగ్రనేత అరెస్ట్
గూర్ఖా జనమూక్తి మోర్చా (జీజేఎం) అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బినయ్ తమంగ్ను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతధికారులు గురువారం డార్జిలీంగ్లో వెల్లడించారు. అతనితోపాటు మరో అరుగురు అనుచరులను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. పశ్చిమ బెంగాల్- సిక్కిం రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జీజేఎం అధినేత బిమల్ గురుంగ్కు బియన్ తమంగ్ ముఖ్య అనుచరుడని పోలీసులు పేర్కొన్నారు.
గతంలో గృహదహానాలతోపాటు పలు కేసులు బిమల్ పై నమోదు అయిన సంగతిని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జీజేఎం ఉద్యమిస్తుంది. అయితే జులై 30న యూపీఏ సర్కార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలం అని ప్రకటించింది. దాంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట ఉద్యమం ఊపందుకుంది.
అందులోభాగంగా పశ్చిమ బెంగాల్లో గూర్ఖాలాండ్ ప్రాంతాన్ని కూడా ఓ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని జీజేఎం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దాంతో నిత్యం ఉద్యమాలతో ఆ ప్రాంతం నిరసన సెగలు కక్కుతుంది. అయితే ఇప్పటికే జీజేఎం నేత బిమల్ గురుంగ్ను మమత ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జులై 30 నుంచి నేటి వరకు 710 మంది జీజేఎం కార్యకర్తలను అరెస్ట్ చేశారు.