భద్రాచలంలో పురోహితుల ఆందోళన
ఖమ్మం : ఖమ్మం జిల్లా భద్రాచలం పుష్కర ఘాట్ వద్ద పురోహితులు గురువారం ఆందోళనకు దిగారు. ఘాట్ల వద్ద తమను పోలీసులు పిండప్రదానం చేయనీయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సుమారు రెండు గంటల నుంచి పిండ ప్రదానం కార్యక్రమం ఆగిపోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా భద్రతా కారణాల వల్ల పురోహితులు.. వేరేప్రాంతంలో పిండప్రదానం చేయాలని పోలీసులు సూచించటంతో ...వివాదం నెలకొంది. దాంతో తమను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పురోహితులు ...పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద నిరసనకు దిగారు.
తమకు ప్రత్యేకంగా ఏదైనా ప్రాంతం చూపిస్తే, అక్కడకు వెళ్లడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఇప్పటికిప్పుడు తమను అడ్డుకోవటం సరికాదన్నారు. దీంతో పోలీసులకు, పురోహితులకు మధ్య సమన్వయం కొరవడటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ సునీతా మోహన్ ...పురోహితులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకూ ఈ వ్యహారంపై జోక్యం చేసుకోలేదు.