పెన్నాలో మహిళ మృతదేహం
వల్లూరు: బాకరాపురం సమీపంలోని పెన్నాలో మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం బయట పడింది. ఆ మృతదేహం నదిలోని ముళ్ల పొదల మధ్య చిక్కుకుని ఉండటంతో గమనించిన గ్రామస్తులు వీఆర్వో వీరనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృత దేహం కుళ్లిపోయి తరలించడానికి వీలు కాక పోవడంతో కడప రిమ్స్‌కు చెందిన డాక్టర్ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఆమెకు 30 నుంచి 40 ఏళ్లు ఉండవచ్చు. బ్లూ కలర్ చీర, బ్రౌన్ కలర్ జాకెట్ ధరించి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.