దేశ విభజన రోజులను తలపిస్తున్నాయి
సరిహద్దు ప్రాంత ప్రజల ఆవేదన
న్యూఢిల్లీ: ప్రస్తుతం పాక్- భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో సరిహద్దులోని గ్రామస్తుల పరిస్థితుల అగమ్యగోచరంగా మారింది. సరిహద్దు ప్రాంతాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు చెబుతున్నారని.. కానీ తాము ఎక్కడికి వెళ్లాలి? ఎన్ని రోజులు ఉండాలి? ఎలా జీవించాలి? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వాలని పంజాబ్ ఫిరోజ్పూర్ జిల్లాకు చెందిన బిందేర్ కౌర్ (86) అన్నారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 1971లో పాక్ -భారత్ విభజన రోజులు గుర్తొస్తున్నాయన్నారు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి ఉండేదని.. ఇప్పుడూ అదే పరిస్థితి ఉందన్నారు.