పీఆర్సీఐ కొత్త అధ్యక్షుడిగా బి.ఎన్.కుమార్
హైదరాబాద్: పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీఆర్సీఐ) జాతీయ అధ్యక్షుడిగా బి.ఎన్.కుమార్ నియమితులయ్యారు. కాన్సెప్ట్ పీఆర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అయిన కుమార్ గతంలో పీఆర్సీఐ ఉపాధ్యక్షుడిగా, ముంబై చాప్టర్, పీఆర్సీఐకు అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేశారని పీఆర్సీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషనల్‌గా, జర్నలిస్టుగా కుమార్‌కు 40 ఏళ్ల అపార అనుభవం ఉందని పీఆర్సీఐ చీఫ్ మెంటార్, చైర్మన్ ఎమిరిటస్ కూడా అయిన ఎం.బి. జయరామ్ పేర్కొన్నారు.