నగరపాలక అధికారులకు హై కోర్టు చివాట్లు
– ట్యాంకు తొలగించకపోతే మేయర్, అధికారులపై ఫిర్యాదు చేస్తాం
– వైఎస్సార్ సీపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామి రెడ్డి
అనంతపురం న్యూసిటీ : తమ స్థలం (బీఎన్ఆర్ కన్స్ట్రక్షన్)లో అక్రమంగా ట్యాంకు నిర్మాణం చేపట్టడంపై హై కోర్టు నగరపాలక సంస్థ అధికారులకు చివాట్లు పెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంల ో మాట్లాడారు. కోర్టును ధిక్కరించి నిర్మాణాలు చేçపట్డడంపై కుంటి సాకులు చెప్పడం సరికాదని ఈ నెల 8న హైకోర్టు జస్టిస్ పీ నవీన్ రావు నగరపాలక సంస్థ అధికారులకు అక్షింతలు వేశారన్నారు.
అక్టోబర్‌లో మేయర్ స్వరూప దగ్గర ఉండి మిస్సమ్మ స్థలంలో నీటి ట్యాంకు ఏర్పాటు చేయడంతో పాటు ముళ్లపొదలను నగరపాలక సంస్థ జేసీబీతో తొలగించారని ఆయన తెలిపారు. దీనిపై బీఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత, తమ సోదరుడు రెడ్డప్పరెడ్డి హైకోర్టును ఆశ్రయించారన్నారు. దీనిపై కోఽర్టు పైవిధంగా స్పందించిందన్నారు. మిస్సమ్మ స్థలంపై సర్వ హక్కులు కన్స్ట్రక్షన్కే చెందుతాయన్నారు. మేయర్ స్వరూప న్యాయస్థానాన్ని ధిక్కరించడంతో పాటు రెవెన్యూ అధికారుల మాటలను పక్కనపెట్టి నిర్మాణ పనులు చేయించారని ఆరోపించారు. పోలీసుల కరూడా మేయర్‌కు వంతపాడారన్నారు. వెంటనే ట్యాంకును తొలగించాలని లేకపోతే మేయర్, నగరపాలక అధికారులపై పోలీసు స్టేషతోపాటు, కోర్టులో ఫిర్యాదు చేస్తామనానరు.