Bobby Simhaa
-
పుష్ప: విజయ్ అవుట్.. బాబీ సింహా ఇన్ !
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈసినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి అటవీశాఖ అధికారి పాత్రలో నటిస్తున్నారనే విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ అధికారులు, చాలా మంది తమిళులను స్మగ్లర్లుగా భావించి వారిని కాల్చి చంపిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న కారణంగా తమిళ హీరో అయిన విజయ్ సేతుపతి ఈ పాత్రలో నటిస్తే తమిళ అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్ధేశంతో ఆయన ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు సమాచారం. (‘పుష్ప’ సర్ప్రైజ్: బన్నీకి లవర్‌గా నివేదా) అయిదు భాషల్లో విడుదల కానున్న ‘‘పుష్ప’ సినిమా లాక్‌డౌన్‌తో షూటింగ్ వాయిదా పడటంతో మళ్లీ ఎప్పుడు చిత్రీకరణ ప్రారంభం అవుతుందో తెలియని కారణంగా విజయ్ డేట్లు సర్దుబాటు చేయలేనని సైడ్ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విజయ్ పాత్రలో మళ్లీ తమిళ నటుడినే తీసుకోవాలని అనుకున్న చిత్ర బృందం తాజాగా బాబీ సింహాతో చర్చలు జరుపుతున్నట్లు సినిమా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మరో హీరోయిన్ పాత్రలో కేరళ కుట్టి నివేదా థామస్ కనిపించనున్నారు. (పుష్ప సినిమాకు విలన్ ఖరారు!) -
ఫెయిల్యూర్స్‌ను ఎంజాయ్ చేస్తాను
‘‘తెలుగులో నాకు చాలా అవకాశాలు వచ్చాయి. వస్తున్నాయి. కానీ కథ లేని సినిమాల్లో నటించడం ఇష్టం ఉండదు. కథ బాగుంటేనే యాక్టర్‌గా నటించడానికి మనకు పని ఉంటుంది. పారితోషికంనాకు రెండో ప్రాధాన్యం. కంటెంట్ ముఖ్యం’’ అన్నారు నటుడు బాబీ సింహా. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కోరాజా’. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన బాబీ సింహా చెప్పిన విశేషాలు. ►మా తల్లిదండ్రులది విజయవాడ దగ్గర బందర్. నేను హైదరాబాద్‌లో పుట్టాను. నాలుగో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. పదో తరగతి వరకు అవనిగడ్డలో చదువుకున్నాను.1995లో తమిళనాడులోని కొడైకెనాల్‌కు వెళ్లాం. ►‘డిస్కోరాజా’లో నేను సేతు పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలో స్టైల్, కోపం, హాస్యం.. ఇలా అన్ని అంశాలు మిళితమై ఉన్నాయి. యంగ్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్‌లా సినిమాలో నావి రెండు లుక్స్ ఉన్నాయి. రవితేజగారు సెట్లో ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, టైమింగ్ బాగుంటాయి. నేను దాదాపు 45 సినిమాలు చేశాను. నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్‌గా ఆనంద్‌గారి పేరు చెబుతాను. ఆనంద్‌గారు కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తుంటారు. ►నటుడిగా నాకు అన్ని పాత్రలు చేయాలని ఉంది. పాజిటివ్ క్యారెక్టర్ అయితే కొన్ని పరిమితులకు లోబడి చేయాల్సి ఉంటుంది. అదే నెగటివ్ క్యారెక్టర్ అయితే యాక్టింగ్‌కు ఎలాంటి పరిమితులు ఉండవని నా భావన. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు.. కథ బాగుంటే నటిస్తాను. ►రజనీకాంత్‌గారు నాకు స్ఫూర్తి. ‘పేట’లో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ప్రస్తుతం కమల్‌హాసన్‌గారి ‘ఇండియన్ 2’లో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. కమల్‌గారికి అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన ఉంది. తమిళంలో నా గత చిత్రాలు సక్సెస్ కాలేదు. ఫెయిల్యూర్స్‌ను ఎంజాయ్ చేస్తాను. కానీ, ఆడని సినిమాలు ఎందుకు సక్సెస్ కాలేదో విశ్లేషించుకుంటాను. నాతో పాటు స్టార్ట్ అయిన విజయ్ సేతుపతి ముందుకు పరిగెడుతున్నారు అంటున్నారు. నేను వెనక నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. నేను స్టార్ట్ చేస్తా. యాక్టర్స్‌లో కొందరు 100 స్పీడ్‌లో పరిగెడతారు. మరికొందరు 40. నేను 10 –15 స్పీడ్‌లో ఉన్నాననుకుంటున్నాను. కానీ రేస్‌లో మాత్రం ఉన్నాను. ►కెరీర్ మొదట్లో చాలా సినిమాల్లో జూనియర్ ఆరి్టస్టుగా చేశాను. కష్టాలు అనుభవించాను. అయితే అప్పటితో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు అవకాశాలు పెరిగాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్ స్థాయి పెరిగింది. సోషల్ మీడియా ఉంది. నేను మొదట్లో తిరిగినట్లు చాలామంది హైదరాబాద్, చెన్నైలో యాక్టర్స్ కావాలని తిరుగుతుంటారు. దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. అవకాశం కోసం ఎదురుచూడండి. వచి్చనప్పుడు మాత్రం శక్తి వంచన లేకుండా పని చేసి మనల్ని మనం నిరూపించుకోవాలి. ►అవార్డుకు అనుభవం అనేది ఒక కొలమానంగా ఉండాలనే మాట నా దృష్టిలో సరైంది కాదనుకుంటాను. అవార్డు అనేది ప్రేక్షకులు, ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు. నాకు కానివ్వండి, ఇంకొకరికి కానివ్వండి. మనం చేసే పాత్రకు మనం న్యాయం చేశామా? లేదా? ప్రేక్షకులు మనల్ని గుర్తించారా? లేదా అన్నదే ముఖ్యం. ‘జిగర్తాండ’ చిత్రానికి నాకు జాతీయ అవార్డు రావడం సంతోషాన్నిచి్చంది. నిజానికి నాకు జాతీయ అవార్డు గురించి మొదట్లో తెలియదు. నేను జూనియర్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు... ‘‘సార్... నేషనల్ అవార్డు అనేది నేను చేసినా కూడా వస్తుందా? అని అడిగితే, ‘హే... బాబీ అది నేషనల్ అవార్డు’ వదిలేయ్ అని ఓ డైరెక్టర్ అన్నారు. -
త్వరలో ఆ హీరో హీరోయిన్ల పెళ్లిబాజాలు
చెన్నై: మరో సినీ జంట ...త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. 'ఉరుమీన్' చిత్రం హీరో హీరోయిన్ల ప్రేమకథకు కొద్ది నెలల్లో శుభం కార్డు పడనుంది. తమిళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా, హీరోయిన రేష్మీ మీనన్... ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు ఒకే చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో వీరి వివాహాన్ని జరిపించేందుకు నిర్ణయించారు. రెండు కుటుంబాల పెద్దలు... వీరి పెళ్లికి అంగీకరించారని, ఆగస్ట్‌లో నిశ్చితార్థం , 2016 జనవరిలో వివాహ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు హీరో బాబీసింహా తన సన్నిహిత వర్గాలతో పంచుకున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తలపై రేష్మీ మీనన్ కానీ, బాబీసింహా నుంచీ ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు ఈ పెళ్లికి రేష్మి తల్లిదండ్రులకు పెద్దగా ఇష్టం లేకపోయినా కూతురు అభీష్టం మేరకు అంగీకరించినట్టు తెలుస్తోంది. పెద్దలు అంగీకారం ఉన్నా లేకపోయినా, సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలన్న ఇద్దరి ప్రయత్నాలు తెలిసి తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించినట్టు సమాచారం. పిజ్జాతో తెరంగేట్రం చేసి జిగర్ తండ చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డునే సొంతం చేసుకుని అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న నటుడు బాబిసింహా. విలక్షణ విలనీయంతో ఆకట్టుకున్న బాబీ ఇప్పుడు హీరోగా ఎదుగుతున్నారు. బాబీ సింహా, , రేష్మీ జంటగా నటించిన ఉరుమీన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. బాబిసింహా,రేష్మీమీనన్ల తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యతను బాబిసింహా మిత్రుడు, పిజ్జా, జిగర్తండ చిత్రాల దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తన భుజస్కంధాలపైన వేసుకుని...వారి ప్రేమను పెళ్లి వరకూ తీసుకు వచ్చారు.