రాణించిన అనంత బౌలర్లు
అనంతపురం సప్తగిరి సర్కిల్: గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరుగుతున్న ఆంధ్ర అండర్–16 క్రికెట్ పోటీల్లో అనంతపురం, కడప జట్లు నాల్గో మ్యాచ్‌లో తలపడ్డాయి. మొదటి రోజు వర్షం కారణంగా ఆట కొనసాగలేదు. రెండో రోజు ఆట గురువారం ప్రారంభమైంది. టాస్ గెలిచిన అనంతపురం జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 128 పరుగులకే ఆలౌటైంది. అనంతపురం జట్టు బౌలర్లలో మీరజ్‌కుమార్ తన లెగ్‌స్పిన్‌తో 5 వికెట్లు సాధించాడు.
కామిల్ తన లెఫ్ట్ఆర్మ్ స్పిన్‌తో 4 వికెట్లు తీసి కడప జట్టును కుప్పకూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు ఆట ముగిసే సమయానికి అనంత జట్టు 96 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. జట్టులో యోగానంద 37, మహేంద్ర 15 పరుగులు చేసారు. వర్షం కారణంగా మ్యాచ్ ముగిసింది.