చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
హైదరాబాద్: స్థానిక దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరాంపేట చెరువులో ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. 6 వ తరగతి చదువుతున్న సాయికుమార్, ఎనిమిదవ తరగతి చదువుతున్న జయప్రకాష్ ఇద్దరూ సోమవారం ఉదయం సమీపలోని బౌరాంపేట చెరువులో ఈత కొట్టేందుకు వెళ్ళారు. అయితే చెరువులో లోతు ఎక్కువగా ఉన్నందున ప్రమాదవశాత్తూ మునిగి ఇద్దరూ మృతి చెందారు. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.