బీపీఎం పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కర్నూలు డివిజన్ పరిధిలోని 11 పోస్టాఫీస్‌లో బ్రాంచి పోస్టు మాస్టర్ (బీపీఎం) ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాల వయసు నిండిన వారు అర్హులన్నారు. టెన్త్ క్లాస్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. వివరాలకు వెబ్సైట్ (www.royalpost.in)లో చూడవచ్చన్నారు. కర్నూలు డివిజన్ సూపరింటెండెంట్ కార్యాలయంలో కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
27 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ..
మొదటి రోజు ఉదయం 10 గంటలకు హాలహర్వి మండలం మీదేహాలు(ఓసీ), మధ్యాహ్నం 2 గంటలకు తుగ్గలి మండలం పగిడిరాయి(ఎస్సీ) పోస్టాఫీస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 28వతేదీ ఉదయం ఇంగదహాల్ ఎస్ఓ పరిధిలోని లింగదహళ్లి(ఓసీ), మధ్యాహ్నం వందవాగిలి(ఎస్సీ), 29 ఉదయం బసాపురం (ఓసీ), మధ్యాహ్నం ఓర్వకల్లు ఎస్ఓ పరిధిలోని ఎన్. కొంతలపాడు(ఓబీసీ), 30వతేదీ ఉదయం ఇంగల్దహాల్ ఎస్ఓ పరిధిలోని హెబ్బటం(ఓసీ), మధ్యాహ్నం కోసిగి పరిధిలోని డి.బెళగల్లు (ఓబీసీ), 31 ఉదయం దేవనకొండ పరిధిలోని నేలతలమర్రి (ఓసీ), మధ్యాహ్నం ఎరుకల చెర్వు పరిధిలోని ఇగవేలి(ఓసీ), సాయంత్రం పత్తికొండ పరిధిలోని హోసూరు(ఎస్టీ) పోస్టాఫీస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.