ఐసిస్పైకి బాలీవుడ్ సంగీతాస్త్రం
బ్రిటిష్ సైనిక బలగాల యోచన
లండన్: లిబియాలోని ఐసిస్ ఉగ్రవాదులపైకి బ్రిటిష్ సైనిక దళాలు కొత్త అస్త్రాన్ని ప్రయోగించనున్నాయి. వారిని మానసికంగా దెబ్బతీయడానికి బాలీవుడ్ సంగీతాన్ని అస్త్రంగా ఉపయోగించాలని పాక్ సంతతి నిఘా అధికారి బ్రిటిష్ సైన్యానికి సూచించారు. హిందీలో ఇస్లామిక్కు వ్యతిరేకంగా రూపొందించిన పాటలను విని ఉగ్రవాదులు తీవ్రంగా స్పందిస్తారని, అవి వారిని అవమానిస్తాయని, వారి బలమెంతో కూడా తెలుసుకునే వెసులుబాటు లభిస్తుందని బ్రిటిష్ సైనికవర్గాలు తెలిపాయి. ఐసిస్ వ్యతిరేక పాటలపై ఉగ్రవాదులు అక్కడి రేడియాలో తప్పకుండా ఫిర్యాదు చేస్తారని, అదే సమయంలో వారి స్థావరాలను కనుగొనడం సులువవుతుందన్నారు.