హైదరాబాద్ హెరిటేజ్‌పై బ్రిటిషర్ల డాక్యుమెంటరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సంస్కృతి, చరిత్ర, హెరిటేజ్లపై డాక్యుమెంటరీ తీయటానికి బ్రిటిషర్లు నగరానికి చేరుకున్నారు. గురువారమిక్కడ రవీంద్రభారతి లోని భాషా సాంస్కృతిక కార్యాలయంలో సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణను కలిశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాల గురించి అడిగి తెలుసుకొన్నారు. హరికృష్ణను కలిసిన వారిలో యూకేకు చెందిన స్టేఫ్ని ఫైఫ్, కై ్లమ్ తుల్లో, రెష్మా సైరాలు ఉన్నారు.