Brussels attack
-
కీలక విషయం వెల్లడించిన సుష్మ
న్యూఢిల్లీ: బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశన్ కుటుంబానికి సంతాప సందేశాలు వెల్లువెత్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు రాఘవేంద్రన్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ నెల 22న బ్రసెల్స్ లో ఉగ్రవాదుల సమయంలో గల్లంతైన రాఘవేంద్రన్ మృతి చెందినట్టు సోమవారం నిర్ధారించారు. బెంగళూరు ఇన్ఫోసిస్ కు చెందిన అతడు బ్రసెల్స్ మెట్రోరైళ్లో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డాడు. రాఘవేంద్రన్ మరణవార్తను ట్విటర్ ద్వారా ప్రకటించిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కీలక విషయం వెల్లడించారు. ఆత్మాహుతి దళ సభ్యుడు తనకు తానుగా పేల్చేసుకున్న బోగీలోనే రాఘవేంద్రన్ ఉన్నాడన్న దిగ్భ్రాంతకర విషయాన్ని తెలిపారు. అతడి అవశేషాలను బ్రసెల్స్ లోని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు చెప్పారు. రాఘవేంద్రన్ కుటుంబానికి ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాఘవేంద్రన్ ఉన్న బోగీలోనే మానవబాంబు ఉన్నాడన్న విషయం మంత్రి ప్రకటనతో స్పష్టమైంది. కాగా, బ్రసెల్స్ లో పేలుళ్ల తర్వాత కనిపించకుండా పోయిన రాఘవేంద్రన్ ఆచూకీ కోసం అతని సోదరుడు చంద్రశేఖర్ గణేశన్ సోషల్ మీడియా ద్వారా విశ్వప్రయత్నం చేశాడు. ఫేస్ బుక్ ద్వారా భారత ఉన్నతాధికారులను సంప్రదించాడు. ట్విటర్ లో సుష్మా స్వరాజ్ ను సంప్రదించాడు. చంద్రశేఖర్ ప్రయత్నానికి నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. తమకు చేతనైన పద్ధతుల్లో సాయం అందించారు. బస్సెల్స్ లో ఉన్న ఆస్పత్రి వివరాలు అందించడంతో పాటు సూచనలు, సలహాలు అందించారు. అయితే రాఘవేంద్రన్ ప్రాణాలతో లేడన్న సమాచారంతో అతడి కుటుంబ సభ్యులతో పాటు, నెటిజన్లు షాక్ కు గురయ్యారు. Unfortunately, he was travelling in the same coach of the metro in which the suicide bomber blew himself up. /3 — Sushma Swaraj (@SushmaSwaraj) 28 March 2016 -
ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతికి మోదీ సంతాపం
న్యూఢిల్లీ: బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మతిలేని హింసాకాండకు యువకుడి జీవితంగా అర్ధాంతరంగా ముగిసిపోయిందని ట్విటర్ లో పేర్కొన్నారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో విదేశీగడ్డపై ఉద్యోగానికి వెళ్లిన యువకుడిని ముష్కర మూకలు పొట్టన పెట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాఘవేంద్రన్ కుటుంబానికి మోదీ సంతాపం తెలిపారు. ఈనెల 22న బ్రసెల్స్ మెట్రోస్టేషన్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో రాఘవేంద్రన్ మృతి చెందినట్టు సోమవారం నిర్ధారించారు. బ్రసెల్స్ మెట్రోస్టేషన్ తోపాటు విమానాశ్రయంలో ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో 35 మంది మృతి చెందారు. గణేశ్ అవశేషాలను బెంగళూరులోని ఆయన కుటుంబ సభ్యులకు నేడు అప్పగించే అవకాశముంది. A young life, full of hope & promise cut short by mindless violence... condolences to family of Raghavendran, who lost his life in Brussels. — Narendra Modi (@narendramodi) 29 March 2016 -
హమ్మయ్య.. ఆమె భర్త వచ్చేశాడు
ముంబయి: బాలీవుడ్ నటి గుల్ పనాగ్ భర్త, పైలెట్ జీఎస్ అట్టారీ సురక్షితంగా తిరిగొచ్చాడు. బ్రస్సెల్స్‌లో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఆయన క్షేమంగా ఇంటికి చేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. జీఎస్ అటారీ జెట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమాన పైలెట్‌గా పనిచేస్తున్నారు. బ్రస్సెల్స్ లోని మెట్రో స్టేషన్ వద్ద బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకోవడానికి కొద్ది నిమిషాల ముందు ఇండియాకు చెందిన రెండు విమానాలను అదే ఎయిర్ పోర్ట్‌లో దింపారు. ఆ తర్వాత బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో ఆయన అక్కడే స్ట్రక్ అయిపోయారు. దీంతో గుల్ పనాగ్ ఆమె స్నేహితులు తెగ ఆందోళన పడిపోయారు. దీంతో ఆయన సురక్షితంగా తిరిగొచ్చారంటూ ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని అన్నారు.