బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సులో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ) 2017–18 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఫారెస్ట్రీ) నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు గుర్తించిన ఇంటర్మీడియెట్ లేదా తత్సమానమైన విద్యలో బయోలజీ (వృక్ష, జంతుశాస్త్రం), భౌతిక, రసాయనశాస్త్రాల ప్రయోగాల్లో పొందిన మార్కులను ఆధారంగా చేసుకొని మెరిట్ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.
అలాగే కళాశాల రూపొందించిన దరఖాస్తు ఫారంను వెబ్సైట్ ఠీఠీఠీ.జఛిటజ్టీట.జీnలో నింపి కావలసిన సర్టిఫికెట్ కాపీలు అప్‌లోడ్‌చేయాలని, జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్ అభ్యర్థులు రూ.250 రుసుం ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 15 కాగా, రూ.1000 ఫైన్‌తో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ ఫోన్ 8332975516/8333924137 లేదా ఈ మెయిల్ ్టటజఛిటజీ2016ఃజఝ్చజీl. ఛిౌఝను సంప్రదించవచ్చని ఎఫ్సీఆర్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది.