ఈ పాటకు ట్యూన్ తెలుసా?
అక్కినేనికి నివాళి
పల్లవి :
టాటా వీడుకోలు... గుడ్ బై ఇంక సెలవు (2)
తొలినాటి స్నేహితులారా! చెలరేగే కోరికలారా తొలినాటి స్నేహితులారా! చెలరేగే కోరికలారా
॥
చరణం : 1
ప్రియురాలి వలపులకన్నా
నులివెచ్చనిదేదీ లేదని (2)
నిన్నను నాకు తెలిసింది
ఒక చిన్నది నాకు తెలిపింది
ఆ... ప్రేమనగరుకే పోతాను పోతాను
పోతాను...
ఈ కామనగరుకే రాను... ఇక రాను
॥
చరణం : 2
ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని
లేటుగ తెలుసుకున్నాను
నా లోటును దిద్దుకున్నాను
ఆ... స్నేహనగరుకే పోతాను పోతాను
పోతాను...
ఈ మోహనగరుకు రాను... ఇక రాను
॥
చరణం : 3
మధుపాత్రకెదలో ఇంక ఏమాత్ర ం చోటులేదని మధుపాత్రకెదలో ఇంక ఏమాత్ర ం చోటులేదని
మనసైన పిల్లే చెప్పింది... (2)
నా మనసంతా తానై నిండింది (2)
నే రాగనగరుకే పోతాను
అనురాగనగరుకే పోతాను పోతాను...
చిత్రం : బుద్ధిమంతుడు (1969)
రచన : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల