bykes
-
వారికి ఉచితం.. వరద బాధితులకు సుజుకీ ఆఫర్
మిచాంగ్ (Michaung) తుపాన్ ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇక వర్షపు నీటితో వాహనాలన్నీ పాడైపోయాయి. ఈ క్రమంలో వీరికి అండగా జపనీస్ వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు భారతీయ అనుబంధ సంస్థ అయిన సుజుకీ మోటర్‌సైకిల్ ముందుకు వచ్చింది. చెన్నైతోపాటు పొరుగు జిల్లాల్లో వరద ప్రభావిత వినియోగదారులకు ఉచిత సర్వీస్‌ను ప్రారంభించినట్లు సుజుకీ మోటర్‌సైకిల్ సంస్థ శనివారం తెలిపింది. వరద బాధితులపై వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం దీని లక్ష్యం. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరులో డీలర్ నెట్‌వర్క్‌లను యాక్టివేట్ చేసి వినియోగదారులకు ఉచిత సమగ్ర చెకప్‌లతో సర్వీస్ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతోపాటు డిసెంబర్ చివరి వరకు ఇంజిన్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్లను ఉచితంగా రీప్లేస్మెంట్ చేస్తున్నట్లు తెలిపింది. మిచాంగ్ తుఫాను పలు నగరాల్లోని ప్రజల జీవితాలు, వారి వస్తువులపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సుజుకీ మోటర్‌సైకిల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు. దీని కింద వాహనాల సర్వీస్‌తో పాటు అవసరమైన విడిభాగాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చొరవ వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా తమ కస్టమర్ల కోసం మొబిలిటీని త్వరగా పునరుద్ధరించడాన్ని వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: ఏకంగా రూ.91 వేల కోట్ల ఆస్తి.. పనివాడే వారసుడు! -
పల్సర్ బైక్‌లే టార్గెట్.. ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఏర్పడిన పరిచయం..
ఎమ్మిగనూరు రూరల్: బళ్లారి కౌల్ బజార్ ప్రాంతంలో పల్సర్ బైక్‌లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడికి చెందిన హమన్, కడిమెట్లకు చెందిన మహేష్, శంకర్, విక్కిని నుంచి 30 పల్సర్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో ఓ రిటైర్డ్ ఏఎస్ఐ బైక్ చోరీకి గురైంది. బళ్లారి కౌల్ బజార్ పోలీసులు బళ్లారిలో వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న అబ్దుల్‌ను అనుమానంతో అదుపులో తీసుకుకొని విచారణ చేపట్టగా బైక్ చోరీల వ్యవహారం వెలుగు చూసింది. కై రవాడికి చెందిన హమన్ బళ్లారిలో ఓ ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు అబ్దుల్‌తో పరిచయం ఏర్పడింది. అబ్దుల్ బైక్‌లను చోరీ చేసి హమన్‌కు అప్పగించే వాడు. హమన్...కడిమెట్లకు చెందిన మహేష్, శంకర్, విక్కితో కలిసి బైక్‌లను కేవలం రూ.15 వేల నుంచి రూ.20 వేల లోపు విక్రయించే వారు. ఆ బైక్‌లను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో విక్రయించినట్లు సమాచారం ఇవ్వడంతో కౌలుబజార్ ఎస్ఐ శివకుమార్‌నాయక్ ఎమ్మిగనూరులో మకాం వేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. గోనెగండ్ల పోలీస్టేషన్ పరిధిలో 19, ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ పరిధిలో 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బళ్లారికి తరలించారు. చదవండి: వ్యవసాయ అధికారి వంచన.. పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి -
కారు బీభత్సం.. టైరు పగిలి.. మూడు బైకులను ఢీకొట్టి..
సాక్షి,ధర్మారం(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. టైరు పగిలిపోయి.. అదుపు తప్పి, మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం రేవెళ్లి గ్రామానికి చెందిన పల్లపు శంకరయ్య–నాగమ్మ దంపతులు శనివారం ఉదయం రాయపట్నం వద్ద గల గోదావరిలో పుణ్యస్నానం చేసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కారు మంచిర్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తోంది. ధర్మారం చేరగానే కారు టైరు పగిలి, అదుపుతప్పి వారి వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం మరో రెండు బైకులను కొట్టేసి, ఆగిపోయింది. ఈ ఘటనలో శంకరయ్య కాలు విరిగింది. నాగమ్మ, ఇంకో బైక్‌పై ఉన్న ధర్మారం గ్రామానికి చెందిన ఒల్లెపు ఎల్లయ్య స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం శంకరయ్యను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. ఆ విషయం తెలిసి పవిత్ర నిలదీయగా..