బైపాస్ టన్నెల్ పూర్తి
అవుకు: గాలేరు నగరి సుజల స్రవంతి ప్యాకేజ్ నెంబర్–30లో భాగంగా అవుకులో నిర్మిస్తున్న సొరంగాల్లో ఒక (బైపాస్) టన్నెల్ పూర్తి అయినట్లు ఈఈ పాపారావు తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ రెండు సోరంగాలు ఒక్కొక్కటి 6కిమీ పొడవుతో 20 వేల క్యూసెక్కుల నీటిని పంపడానికి డిజైన్ చేసినట్లు తెలిపారు. ఎన్ట్రీ నుంచి ఆడిట్ పాయింట్‌కు మధ్యలో లెఫ్ట్ టన్నెల్లో 300 మీటర్లు, రైట్ టన్నెల్లో 394 మీటర్ల మేర ఫాల్ట్‌జోన్ ఉండటం వల్ల టన్నెల్ పని సమస్యగా మారిందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికె బైపాస్ టన్నెల్‌ను నిర్మించామన్నారు. బైపాస్ టన్నెల్లో 5 వేల క్యూసెక్కుల నీరు వెళ్తుందన్నారు. రెండు నెలల్లో లైనింగ్ పనులు పూర్తి చేసి వచ్చె ఖరీఫ్ సీజన్‌కు ఒక సొరంగం ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు నీరు తప్పక అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈ మనోహర్ రాజు, టన్నెల్ జీఎం శ్రీవారి, సిబ్బంది నాగభూషణం పాల్గొన్నారు.