రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
ఓ మెడికల్ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా
మరో ఇద్దరికి తీవ్రగాయూలు
ఆగి ఉన్న లారీని కారుఢీకొనడంతో ప్రమాదం
మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
బాధితులంతా వైద్య విద్యార్థులే
మడికొండ/ఎంజీఎం, న్యూస్‌లైన్ : సరదాగా ఐదుగురు మెడికల్ విద్యార్థులు కలిసి విహారానికి బయల్దేరగా వారి ప్రయూణం విషాదంతమైంది. ఆగి ఉన్న లారీని ఢీకొని ఓ మెడికల్ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ నగర శివారు మడికొండ పెట్రోల్‌పంప్ వద్ద సోమవారం రాత్రి జరిగింది.
స్థానికులు, క్షతగాత్రుల కథనం ప్రకారం... వరంగల్ కాశిబుగ్గకు చెందిన వైద్యులు డాక్టర్ టి.భాస్కర్, శోభారాణి దంపతుల కుమార్తె చైతన్యశ్రీ(24), ఎంజీఎం యూరాలజిస్టు డాక్టర్ సురేందర్ కుమార్తె పూజిత, జనగామ వ్యాపారవేత్త నర్సింహారెడ్డి కుమార్తె సుష్మ, దుబాయ్‌కి చెందిన నజియా కరీంనగర్ జిల్లా ప్రతిమ మెడికల్ కళాశాలలో హౌస్‌సర్జన్ నాలుగో సంవత్సరం పూర్తి చేశారు. వీరంతా ఆదివారం వరంగల్ కేఎంసీ, నిట్‌లో నిర్వహించిన మెడికల్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు హాజరయ్యారు.
సోమవారం సాయంత్రం అంతా కలిసి హన్మకొండ హంటర్‌రోడ్డులోని వనవిజ్ఞాన కేంద్రం(జూ పార్కు)కు వెళ్లారు. అరుుతే జూ పార్క్ మూసి ఉండడంతో హైదరాబాద్‌కు వెళ్దామని బయల్దేరారు. కారు మడికొండలోని పెట్రోల్‌పంప్ సమీపంలోకి రాగానే డ్రైవింగ్ చేస్తున్న చైతన్యశ్రీ తమ్ముడు ఉదయ్‌రాజ్ షూ క్లచ్, గేర్ మధ్య ఇరుక్కుంది. దీంతో కాలిని పైకి తీసే క్రమంలో కారు అదుపుతప్పి అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో చైతన్యశ్రీ అక్కడి కక్కడే కారులో మృతిచెందగా పూజిత, నజియా తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.
మృతురాలు చైతన్యశ్రీ ఎడమ చేయి పూర్తిగా తెగి దూరంగా పడిపోయింది. మడికొండ సీఐ నందిరాంనాయక్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో, ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి పంపించారు. ప్రమాద స్థలాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంత రాయం ఏర్పడడంలో పోలీసులు వన్‌వేలో వాహనాలను పంపించారు. స్వల్పగాయాలైన సుష్మ, హృదయ్‌రాజ్ నుంచి సీఐ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమచారమిచ్చారు.
అతివేగమే ప్రమాదానికి కారణమా..
అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనం వెనుకాలే వస్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఆగిపోయారు. ప్రమాద సమయంలో కారు వేగం 120 స్పీడ్‌తో ఉన్నట్లు తెలుస్తోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయ్‌రాజ్ కాకతీయ మెడికల్ కళాశాలలో(కేఎంసీ)లో సెకండయరీ చేస్తున్నాడు. బాధితులను డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తోపాటు పెద్దఎత్తున వైద్యులు తరలివచ్చి పరామర్శించారు.