మంత్రి 100 అడిగితే...10 ఇచ్చారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు దీనస్థితి మరోసారి చర్చనీయంశమైంది. దేవాదాయశాఖలో అధికారులదే అధిపత్యంగా నడుస్తుంది. మంత్రిని ఇటు ఏపీ ప్రభుత్వం, అటు అధికారులు పూర్తిగా పక్కనపెట్టేశారు. మంత్రి మాణిక్యాలరావు నోటీసులో లేకుండానే అధికారులు జీవోలు జారీ చేస్తున్నారు.
తాజాగా స్వయనా దేవాదాయ శాఖమంత్రి లేఖలను టీటీడీ పట్టించుకోలేదు. దర్శనం కోసం మంత్రి సిఫార్సు లేఖలు ఇచ్చినా టీటీడీ బుట్టదాఖలు చేసింది. సాక్షాత్తూ టీటీడీ కొత్త సంవత్సరం దేవుడి డైరీలు దక్కకపోవడంపై ఆయన ఆవేదన చెందారు. 100 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు కావాలని మాణిక్యాలరావు ఆర్డర్ చేస్తే కేవలం పదే డైరీలు, క్యాలెండర్లు ఇచ్చి టీటీడీ చేతులు దులుపుకుంది. దీంతో మంత్రి తీవ్ర అసహానానికి గురైనట్లు తెలుస్తుంది. గోదావరి పుష్కరాల్లోనూ మంత్రి మాణిక్యాలరావు ప్రమేయం పరిమితం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.