ప్రాణం తీసిన సెల్ఫోన్
సెల్ఫోన్ మాట్లాడుకుంటూ పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న చంద్రయ్యగౌడ్(50) సిగ్నల్గడ్డ వద్ద ఉన్న బ్రిడ్జి సమీపంలో సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొట్టింది. దీంతో ఆయన మృతదేహం రెండు ముక్కలైంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.