కారు బాంబు పేలుళ్లు: 31 మంది మృతి
చైనాలోని జింగ్ జియాంగ్ ప్రాంతం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆ ప్రమాదంలో 31 మంది మరణించారు. దాదాపు 90 మందికిపైగా గాయపడ్డారు. గురువారం ఉదయం జింగ్ జియాంగ్లో రెన్మిన్ పార్క్ వద్ద పార్క్ నార్త్ మార్కెట్ నిత్యవసర వస్తువులు కోసం వచ్చిన కొనుగోలుదారులతో నిండి ఉంది... ఆ సమయంలో రెండు కారు బాంబులు ఒకదాని వెంట ఒకటి పేలాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య పెరిగిందన్నారు.
క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే వారిలోల కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారన్నారు. జింగ్ జియాంగ్ ప్రాంతంలో అత్యధికంగా ముస్లింలు నివసిస్తున్నారు. గతేడాది నుంచి ఆ ప్రాంతంలో దాడులు సంఖ్య పెరిగిందని చెప్పారు. ఉర్మిక్లోని రైల్వే స్టేషన్లోని గత నెలలో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మృతి చెందగా, 80 మంది గాయపడిన సంగతి తెలిసిందే.