ప్లూటోపై రంగులు!
వాషింగ్టన్: ప్లూటోతోపాటు దాని ఉపగ్రహం చరోన్పై వివిధ రంగులతో కూడిన వలయాలున్నట్లు నాసా గుర్తించింది. ‘ప్లూటో టైమ్’ పేరుతో సామాజిక మాధ్యమంలో నాసా నడిపిన ఉద్యమానికి 7 వేల మంది తాము సేకరించిన చిత్రాలను పంపించారు. వీటన్నింటినీ ఒకచోట చేర్చిన నాసా.. అసలు చిత్రాలను, ప్లూటోపై ఉన్న రంగుల వలయాలు, ఇందుకు కారణాలను వివరించింది. ప్లూటో గ్రహం సూర్యునికి చాలా దూరంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మధ్యాహ్నం పడే సూర్యరశ్మి.. ఉదయం, సాయంత్రం భూమిపై పడే సూర్యుని వెలుతురుతో సమానం.
అత్యంత దూరంలో ఉన్న ప్లూటోపైకి సూర్యుని కిరణాలు చేరుకునే క్రమంలో తీవ్రతలో మార్పు కారణంగా వలయాలు కనిపిస్తున్నాయని.. సంధ్యాసమయంలో భూ వాతావరణంలోనూ అలాంటి వలయాలు కనిపిస్తాయని కొందరు పరిశోధకులు నాసాకు పంపిన సమాధానాల్లో పేర్కొన్నారు.