ప్యాకేజీలోలేని వాటికీ క్యాష్‌లెస్ చికిత్స
- ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంలో మరో వెసులుబాటు
- అధునాతన చికిత్సలు, వైద్య పరీక్షలన్నింటికీ వర్తింపచేసేలా వీలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు అపరిమిత వైద్య సేవలు అందనున్నాయి. ప్యాకేజీలో లేని వైద్య పరీక్షలు, వ్యాధులకు చికిత్స కూడా ఉచితం గానే అందించనుంది. ఈ మేరకు ఉద్యో గులు, జర్నలిస్టుల నగదు రహిత ఆరోగ్య పథకంలో అనేక వెసులుబాట్లు కల్పిం చింది. వాస్తవంగా ఈ పథకంలో 1899 వ్యాధులకు, 3,783 రకాల వైద్య పరీక్షలకు మాత్రమే ప్యాకేజీ ఖరారు చేశారు. ఆ ప్రకారమే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్ని సేవలు అందుతాయి. అయితే, ఇవిగాక ప్యాకేజీలో పేర్కొనని ఇతరత్రా వ్యాధులు వచ్చినా, అధునాతన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాల్సి వచ్చినా కూడా వాటికీ నగదు రహిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వ్యాధి, వైద్య పరీక్షల వివరాలను ఆయా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలు తమకు తెలియజేస్తే, అందుకయ్యే సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దీనివల్ల ప్యాకేజీలో లేని వ్యాధులకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు.
కొత్త వ్యాధులు... అధునాతన చికిత్స పద్ధతులు
వైద్య రంగంలో అధునాతన చికిత్సా పద్ధ తులు వస్తున్నాయి. వీటిని అందిపుచ్చు కోవడంలో హైదరాబాద్ ముందుంది. ఎలాంటి కొత్త వ్యాధి వచ్చినా ఉద్యోగులు, జర్నలిస్టులకు నగదు రహితం అందించా లని నిర్ణయించారు. గుండె, కిడ్నీ, లివర్, కేన్సర్ తదితర వ్యాధులను ప్యాకేజీగా ఖరారు చేశారు. ఈ ప్యాకేజీలో లేని వాటిని మైనర్, మేజర్ సర్జరీలుగా విభజించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మైనర్ చికిత్స అయితే రూ.57 వేలు, మేజరైతే రూ. 1.46 లక్షలు ఇస్తారు. కిడ్నీ ప్యాకేజీలో లేని మైనర్ చికిత్సకు రూ.11,500, మేజరైతే రూ.57 వేలు ఇస్తారు. అంతకంటే ఎక్కువైతే చర్చించి నిర్ణయం తీసుకుంటారు. యూరాలజీలో ప్యాకేజీలో లేని విధంగా వ్యాధి ఏదైనా వస్తే మైనర్‌కు రూ.11,500, మేజర్ శస్త్రచికిత్సకు రూ.57 వేలు ఇస్తారు.