తూకాల్లో మోసాలు : వ్యాపారి అరెస్టు
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలో పత్తి రైతులను మోసగిస్తున్న ఓ వ్యాపారిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పత్తి బ్రోకర్ మల్లేశ్ మంగళవారం నంబాల గ్రామంలో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తూకం వేసిన ప్రతిసారి నాలుగు కిలోల మేర తక్కువగా చూపిస్తూ మోసం చేస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించిన రైతులు మల్లేశ్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.