సెల్ బ్యాలెన్సుల కోసం సమాధుల తవ్వకం!
నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని 28 వార్డులో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలోని సమాధులను ధ్వంసం చేసిన కేసులో 10 మంది మైనర్ పిల్లలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆకతాయి తనంతో చేసినట్టు నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ ఎం.బాలకృష్ణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. పట్టణంలోని క్రైస్తవ శ్మశాన వాటికలోని సమాధులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కన్వీనర్ పిల్లి డేవిడ్ కుమార్, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు పట్టణ పోలీస్ స్టేష¯ŒSలో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ కేసులో చర్చిపేటకు చెందిన 10 మంది మైనర్ పిల్లలు ఆకతాయితనంతో సమాధులను ధ్వంసం చేసినట్టు గుర్తించామన్నారు. సమాధులు, సమాధులపై శిలువలో ఉన్న ఇనుప ఊచలను స్థానిక పాత ఐర¯ŒS షాపుల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో సెల్ బ్యాలె¯Œ్స వేసుకుని పిల్లలు తప్పుదోవ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతుందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సీఐ తెలిపారు. ఆకతాయి చిన్నారుల తల్లిదండ్రులను పోలీస్స్టేష¯ŒSకు పిలిపించి వారికి పిల్లల పెంపకం, తీసుకోవాలి్సన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇచ్చారు. పట్టణ ఏస్సై జి.సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.