సహనం.. మన జీవన మార్గం
నిడదవోలు : తన కోపమే తన శత్రువు.. ఏ కార్యమైన శాంతి, సహనంతోనే జయించవచ్చని ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. నిడదవోలు మండలంలోని ఉనకరమిల్లిలో సీతారామ మందిరం వద్ద శ్రీరామనవమి వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పారు. సుమారు గంటపాటు రామాయణంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, రా ముడు, సీత అన్యోన్యత, భక్తిమార్గాలను ప్రబోధించేలా ఆయన ప్రసంగం ఆసాం తం ఆకట్టుకుంది. ఓర్పు, సహనం జీవన మార్గం కావాలని, వీటిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చెప్పారు. సీతామాత శాంతి, సహనం మార్గాలతో విజయం సాధించిందన్నారు. ఆలయాలకు వెళ్లి పూజలు చేసినంత మాత్రం ఫలితం సిద్ధించదని, మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా చేసిన పూజ సంపూర్ణంగా ఫలితాని్నస్తుందని చెప్పారు. సీతామాతను మహిళలంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చాగంటి ప్రవచనానికి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు.