నేను మీ వాడినే.. దరువేసిన హరీశన్న..
డప్పుచప్పుళ్లతో దద్దరిల్లిన జిల్లా కేంద్రం
ఎమ్మార్పీఎస్ ‘చలో సంగారెడ్డి’ సక్సెస్
మీ హక్కులను కాపాడుతా
ఎమ్మార్పీఎస్ బహిరంగ సభలో మంత్రి హరీశ్
డప్పు చప్పుళ్లతో సంగారెడ్డి పట్టణం మార్మోగింది. ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ‘చలో సంగారెడ్డి’ సక్సెస్ అయింది. మాదిగల హక్కుల సాధనకు స్థానిక ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. అంతకుముందు ఐబీ అతిథి గృహం నుంచి ఐటీఐ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గిద్ద రామనర్సయ్య ఆధ్వర్యంలో కళాకారుల బృందం ఆటపాటలతో ఉర్రూతలూగించింది. సభకు హాజరైన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు డప్పుతో దరువేసి అందరిని ఆకట్టుకున్నారు. సభికులను కొద్దిసేపు ఉత్సాహపరిచారు. ‘నేను మీ వాడినే.. మీ వెంటే ఉంటా..’నంటూ మాదిగలకు భరోసా ఇచ్చారు.
- సంగారెడ్డి టౌన్ మీ వెంటే ఉంటా..
సంగారెడ్డి టౌన్: ‘నేనూ, మీ వాడినే... మీ వెంటే ఉం టా... మీవి న్యాయమైన కోరికలు... అడిగే హక్కు మీకుంది... మీ సమస్యలను తీర్చే బాధ్యత మాపై ఉంది’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ‘చలో సంగారెడ్డి’ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఐటీఐ మైదానంలో నిర్వహిం చిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీ తో పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే ప్రతి మండలానికి మూడు ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పా టు చేయనున్నట్టు తెలిపారు. ఎస్సీలు అన్ని విధాలా అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ కలసాకారమవుతుందన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని ఎస్సీ వర్గీకరణ బిల్లు కు సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకంలో మాదిగలకు ఎక్కువ శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యమాన్ని వాడుకున్న మంద కృష్ణ...
గత ఇరవై ఏళ్లుగా మాదిగల ఉద్యమాన్ని మంద కృష్ణ మాదిగ తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుని, ఉద్యమాన్ని నీరుగార్చి, మాదిగలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు అల్లారం రత్నయ్య మాదిగ విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీను, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు అల్లారం రత్నయ్య మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి గుర్రాల శ్రీనివాస్ మాదిగ, నాయకులు డప్పు శివరాజు, నర్సింలు, పాపయ్య మాదిగ, చిలుక ప్రభాకర్ మాదిగ, పొన్నాల కుమార్ మాదిగ, లక్ష్మి, క్యాసారం ప్రవీణ్ కుమార్, బూడిద నర్సింగ్‌రావు, చిక్కుల కుమార్, హన్మంతు, యేసు తదితరులు పాల్గొన్నారు.