ఒలింపిక్ హీరోకు దొంగలు గట్టి ఝలక్
రియోడిజనిరో: అతడు ఓ ఒలింపిక్ హీరో.. కానీ.. ముగ్గురు దొంగలముందు మాత్రం జీరో అయ్యాడు. మారు వేషాల్లో వచ్చిన దొంగలు తాము పోలీసుల మని చెప్పి గట్టి ఝలక్ ఇచ్చారు. ఆ ఒలింపిక్ హీరోను మరో ముగ్గురు ఒలింపిక్ అథ్లెట్లను దోచుకున్నారు. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి దొంగలు ఈ పని చేశారు. అసలే బ్రెజిల్ దోపిడీలకు అడ్డా అని ముందుగానే అందరికీ తెలిసిందే. అమెరికన్ స్విమ్మర్ రియా లోక్టే.. తాజాగా జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో అప్పుడే ఓ బంగారు పతకాన్ని తన ఖాతాలో కూడా వేసుకున్నాడు.
ఈ గేమ్ ముగిసిన వెంటనే మరో ముగ్గురు అథ్లెట్లతో కలిసి ఓ రెస్టారెంట్ లో పార్టీకి వెళ్లిన అతడు ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగొస్తుండగా అనూహ్యంగా వారి కారును ముగ్గురు వ్యక్తులు ఆపేశారు. వారంతా పోలీసులు దుస్తుల్లో ఉన్నారు. ఆ రియన్ తో సహా ముగ్గురుని గ్రౌండ్‌పై మోకరిల్లమని బెదిరించారు.
మిగితా ముగ్గురు అలా చేయగా తాను ఏం తప్పు చేయలేదని, ఎందుకు మొకాళ్లపై నిల్చోవాలని రియాన్ ప్రశ్నించాడు. దీంతో ఆ దొంగ పోలీసుల్లో ఒకరు రియాన్ తలకు తుపాకీ గురిపెట్టారు. అనంతరం వారి పర్సులను తీసుకొని ఉడాయించారు. ఈ సీన్ రియాన్ కు చెమటలు పట్టించింది. వారి ఏం చేయకుండానే వెళ్లడంతో హమ్మయ్య అనుకొని బయల్దేరారు. జరిగిన ఘటనను పోలీసులకు వివరించారు.