Cheguru
-
తెలంగాణలో మరో కరోనా మరణం
సాక్షి, రంగారెడ్డి/ హైదరాబాద్ : తెలంగాణలో మరో కరోనా మరణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేగూర్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. కాగా మహిళ మృతి చెందిన తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 10 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌లు అప్రమత్తమై మహిళ సొంత గ్రామమైన చేగూర్‌ను పరిశీలించారు. అనంతరం మృతురాలి నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ మందును విస్తృతంగా స్ప్రే చేయించారు. కాగా చనిపోయిన మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లో ఎవరెవరు ఉన్నారో గుర్తించి వారిని సిపార్డ్‌లోని క్వారంటైన్ కేంద్రానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మిగిలిన వారికి తమ ఇళ్లలోనే క్వారంటైన్ చేపట్టాలని సూచించారు. -
చేగూరులో పోచమ్మ బోనాలు
చేగూరు(కొత్తూరు) : మండల పరిధిలోని చేగూరులో ఆదివారం పోచమ్మ, మైసమ్మ, ఈదమ్మ బోనాలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు బోనాలను ఊరేగించి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివశంకర్‌గౌడ్, సర్పంచ్ పాండయ్య, పీఏసీఎస్ చైర్మన్ విఠల్, నాయకులు భాస్కర్, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అప్పారెడ్డిగూడలో.. మండలంలోని వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ గ్రామాల్లో ఆదివారం బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాసుధాకర్గౌడ్, నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.