Chennai Beach
-
వైరల్ : తీరంలో వెలుగులు; ప్రమాదానికి సంకేతం..!
సాక్షి, చెన్నై : సముద్ర తీరంలో కాసేపు సేద తీరితే ఎవరికైనా ఉల్లాసంగా ఉంటుంది. అక్కడ రంగురంగుల కాంతులు కూడా ఉంటే డబుల్ ఖుష్ లభించినట్టే..! చెన్నైలోని బంగాళాఖాతం తూర్పు తీరంలో ఆదివారం రాత్రి కనిపించిన ఓ దృశ్యం టూరిస్టులను తెగ ఆకట్టుకుంది. సముద్రం అలలపై నీలం రంగు కాంతి తేలియాడుతూ వస్తుంటే అక్కడున్న వారందరూ ఎంజాయ్ చేశారు. సహజసిద్ధమైన ఈ దృశ్యాన్ని కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్ అయింది. తిరువాన్మియూర్, ఇంజామ్‌బాక్కం బీచ్‌లో ఈ వింత వెలుగు చూసింది. బెసంత్ నగర్ బీచ్‌తో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ కాంతి వెలుగులు కనిపించినట్టు స్థానికులు తెలిపారు. అయితే, ఈ ఆహ్లాదభరిత కాంతులు ప్రమాదానికి సంకేతమని సముద్ర నిపుణులు అంటున్నారు. ఇది బయోల్యూమినస్ కాంతిగా చెప్తున్నారు. కోస్టల్ రిసోర్స్ సెంటర్ అధికారి పూజా కుమార్ మాట్లాడుతూ.. ‘తుమ్మెదలు, బీటిల్స్, ఆంగ్లర్‌ఫిష్, జెల్లీ ఫిష్ వంటి సముద్ర జీవులతో పాటు నాక్టీలియా ఆల్గే వల్ల ఈ బయోల్యూమినస్ కాంతి పుట్టుకొస్తుంది. అయితే, ఈ ఆల్గే వల్ల సముద్రంలో భారీ మొత్తంలో అమ్మోనియా పేరుకుపోతుంది. అది సముద్ర జీవులకు మంచిది కాదు. అమ్మోనియా వల్ల సముద్ర జీవుల ఆహార చక్రం నాశనం అవుతుంది. ఫలితంగా చేపల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అది చేపల ఆహారంలో బాగమైన ప్లాంక్టోన్‌ను కూడా నాక్టీలియా ఆల్గే తినేస్తుంది. ఆక్సిజెన్ లేని ప్రాంతాల్లోనే ఈ ఆల్గే పుట్టుకొస్తుంది. తీర ప్రాంతాలు కాలుష్యమవడం దీనికి కారణం’అన్నారు. -
విద్యార్థి ఉసురు తీసిన అలలు
ధర్మవరం అర్బన్ : సముద్రపు అలలు ఓ విద్యార్థి ఉసురు తీశాయి. ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్‌కు చెందిన ప్రసాద్, ఇందిరమ్మ దంపతుల కుమారుడు రాజశేఖర్ (19) చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు. ఈ నెల 25న తన స్నేహితులతో కలసి అక్కడి బీచ్‌కు వెళ్లాడు. అలల తాకిడికి రాజశేఖర్ చిక్కుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని మంగళవారం ఉదయం ధర్మవరం తీసుకొచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. మృతుడి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ వార్డు ఇన్చార్జ్ బాలిరెడ్డి, నాయకులు బోయ శ్రీనివాసులు, సుబ్రమణ్యం, వాసు తదితరులు పరామర్శించారు. -
ఆ నరకమే హాయిగా అనిపించింది!
‘‘గ్లామర్ పాత్రలకే పరిమితమైపోతే నాకు నేనే బోర్ కొట్టేస్తాను. దాంతో పాటే ప్రేక్షకులకూ బోర్ కొట్టేస్తాను. అందుకే విభిన్నంగా ఉండే పాత్రకు అవకాశం వస్తే.. ఎంతైనా కష్టపడటానికి నేను రెడీ’’ అని తాప్సీ చెప్పారు. అన్నట్లుగానే ‘ముని 3’ కోసం బాగా కష్టపడుతున్నారామె. ఈ చిత్రం కోసం తీసిన ఓ సన్నివేశం కోసం తొమ్మిది గంటల పాటు ఆమె నీళ్లల్లో ఉండాల్సి వచ్చింది. రెండు రోజుల్లో తీద్దామని దర్శకుడు లారెన్స్ అన్నప్పటికీ ఒకే రోజులో తీస్తేనే ఎమోషన్ సరిగ్గా పండుతుందని తొమ్మిది గంటలు నీళ్లల్లో ఉన్నారట. ఫలితంగా నీటిలోంచి బయటికొచ్చేసరికి తాప్సీ ఒళ్లంతా నానిపోయిందట. అయినా తేలిగ్గా తీసుకున్నానని తాప్సీ అంటున్నారు. ఇంకా ఈ చిత్రం కోసం చేసిన మరో క్లిష్టమైన సన్నివేశం గురించి తాప్సీ చెబుతూ -‘‘చెన్నయ్ బీచ్‌లో ఈ యాక్షన్ సీన్ చేశాం. బీచ్‌లోని ఇసుకలో నన్ను ఈడ్చుకెళ్లేట్లు సీన్ అన్నమాట. ఇసుక, చిన్న చిన్న రాళ్లతో నా వళ్లు హూనం అయిపోయింది. ఈ ఫైట్‌ని మూడు రోజులు చేశాం. నరకం కనిపించింది. కానీ, ఆ నరకమే హాయిగా అనిపించింది. ఎందుకంటే, నటిగా పూర్తి సంతృప్తి లభించింది’’ అని చెప్పారు.