ఘనంగా తాళ్లపాక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాజంపేట: పద కవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సిద్దేశ్వరస్వామి ఆలయంలో ఉదయం పల్లకీసేవ నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు.
రాత్రి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చెన్నకేశవస్వామి ఆలయంలో ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి శ్రీదేవి, భూదేవితో కలిసి చెన్నకేశవస్వామి శేషవాహనంపై ఊరేగారు. టీటీడీ అర్చకస్వాములు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. టీటీడీ సూపరిండెంట్ పి.వెంకటశేషయ్య, ఇన్స్పెక్టర్ బాలాజీ, గ్రామస్తులు పాల్గొన్నారు.