సంఘటన దురదృష్టకరం
రాజమండ్రిసిటీ : పుష్కరాల రేవులో జరిగిన నంఘటన దురదృష్టకరమని ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని రాష్ర్ట మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కె.అచ్చెంనాయుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్లు ఆనంకాళాకేంద్రంలో మీడియా సెంటర్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై న్యాయవిచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. విచారణలో తప్పిదం ఎవరిదనే విషయం తెలిసిన వెంటనే చర్యలు చేపట్టనున్నామని పేర్కొన్నారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని మిగిలిన 11 రోజులు స్వయం పర్యవేక్షణలో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరఘాట్లో స్నానం చేయడమేమిటీ? అనే విషయమై వివిధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయని పండితులు చెప్పిన మీదట అక్కడే స్నానమాచరించాల్సి వచ్చిందని వారు తెలిపారు. భక్తులు నిర్భయంగా పుష్కరాలకు తరలిరావాలని వారు పిలుపు ఇచ్చారు. పుష్కరాల్లో మీడియాకు సరైన ప్రాధాన్యం కల్పించకపోవడంతో సమాచార శాఖామంత్రి రఘునాథరెడ్డిపై విలేకరుల తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తారు. బుధవారం నుండి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.